ఉత్తేజ్‌ ఇంట విషాదం

ABN , First Publish Date - 2021-09-13T15:56:57+05:30 IST

సినీ నటుడు, రచయిత ఉత్తేజ్‌ ఇంట విషాదం చోటు చేసుకొంది. ఆయన సతీమణి పద్మ (48) క్యాన్సర్‌తో బాధపడుతూ సోమవారం ఉదయం బసవతారకం ఆస్పత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో తుది శ్వాస విడిచారు.

ఉత్తేజ్‌ ఇంట విషాదం

సినీ నటుడు, రచయిత ఉత్తేజ్‌ ఇంట విషాదం చోటు చేసుకొంది. ఆయన సతీమణి పద్మ (48) క్యాన్సర్‌తో బాధపడుతూ సోమవారం ఉదయం బసవతారకం ఆస్పత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో తుది శ్వాస విడిచారు. ఉత్తేజ్‌ చేసే ప్రతి సేవా కార్యక్రమంలోనూ పద్మ భాగస్వామి అయ్యేవారు. ఉత్తేజ్‌కు చెందిన మయూఖ ఫిల్మ్‌ స్కూల్‌ బాధ్యతలను ఆమె నిర్వహించేవారు. ఉత్తేజ్‌ దంపతులకు చేతన, పాట ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.  పద్మ మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఈరోజు మధ్యాహ్నాం మహ్రాపస్థానంలో పద్మ అంత్యక్రియలు జరగనున్నాయి. అమ్మలేని లోటు ఎవరూ తీర్చలేరని ఉత్తేజ్‌ తనయ చేతన ఉత్తేజ్‌ అన్నారు. 



చిరంజీవి పరామర్శ 

పద్మ మరణవార్త తెలుసుకున్న చిరంజీవి హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని ఉత్తేజ్‌ను పరిమర్శించారు. చిరంజీవి ని చూసిన ఉత్తేజ్‌ బోరున విలపించారు. ప్రకాశ్‌రాజ్‌, బ్రహ్మాజీ, జీవిత తదితరులు ఉత్తేజ్‌ను పరామర్శించారు. 

పలువురు తారలు సోషల్ మీడియా వేదికగా ఉత్తేజ్ కుటుంబానికి సంతాపం తెలిపారు









Updated Date - 2021-09-13T15:56:57+05:30 IST