'ఉస్తాద్ నిన్ను బాగా మిస్ అవుతున్నాం' : ఛార్మి

ABN , First Publish Date - 2021-05-15T20:22:25+05:30 IST

'ఉస్తాద్... నిన్ను బాగా మిస్ అవుతున్నాం' అంటూ తాజాగా ట్వీట్ చేశారు ఛార్మి. నేడు ( మే 15 ) ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని బర్త్ డే సందర్భంగా దర్శక, నిర్మాత పూరి జగన్నాథ్, రామ్, ఛార్మి ఉన్న ఫొటోని పోస్ట్ చేసి మన కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌ను ఎప్పటికీ మర్చిపోలేము. సినిమా చేసినన్ని రోజులు ఎంతో సరదగా గడిపాము.

'ఉస్తాద్ నిన్ను బాగా మిస్ అవుతున్నాం' : ఛార్మి

'ఉస్తాద్... నిన్ను బాగా మిస్ అవుతున్నాం' అంటూ తాజాగా ట్వీట్ చేశారు ఛార్మి. నేడు ( మే 15 ) ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని బర్త్ డే సందర్భంగా దర్శక, నిర్మాత పూరి జగన్నాథ్, రామ్, ఛార్మి ఉన్న ఫొటోని పోస్ట్ చేసి మన కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌ను ఎప్పటికీ మర్చిపోలేము. సినిమా చేసినన్ని రోజులు ఎంతో సరదగా గడిపాము. లెట్స్ సెలబ్రేట్ సూపర్ సూన్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఇస్మార్ట్ శంకర్ భారీ కమర్షియల్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అటు రామ్ ఇటు పూరి సూపర్ ఫాంలోకి వచ్చారు. ముఖ్యంగా రామ్ ఈ సినిమా తర్వాత మాస్ హీరోగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. 


ఇస్మార్ట్ శంకర్ నుంచే ఎనర్జిటిక్ హీరోను RAPO (రామ్ పోతినేని) అని పిలవడం మొదలు పెట్టారు. ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్‌గా వచ్చిన క్రేజ్‌ను ఆ తర్వాత డ్యూయల్ రోల్ పోషించిన రెడ్ సినిమాలో నూ కంటిన్యూ చేస్తూ దాదాపు సేమ్ మేకోవర్‌తో కనిపించడం విశేషం. ఇక ఇదే కాంబినేషన్‌లో డబుల్ ఇస్మార్ట్ శంకర్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం రామ్ తన 19వ సినిమాను ఎన్.లింగు స్వామి దర్శకత్వంలో చేస్తున్నాడు. కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.



Updated Date - 2021-05-15T20:22:25+05:30 IST