‘కబ్జా’ చేస్తున్న ఉపేంద్ర
ABN , First Publish Date - 2021-09-20T12:33:15+05:30 IST
కన్నడ చిత్రరంగ కథానాయకుడు ఉపేంద్ర నటిస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘కబ్జా’ . ఆర్.చంద్రు దర్శకత్వంలో ఆర్.చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని...

కన్నడ చిత్రరంగ కథానాయకుడు ఉపేంద్ర నటిస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘కబ్జా’ . ఆర్.చంద్రు దర్శకత్వంలో ఆర్.చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిచ్చా సుదీప్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా శనివారం ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. 1960ల నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘కబ్జా’లో పక్కా మాస్ అవతారంలో కనిపిస్తున్నారు ఉపేంద్ర. చేతిలో కత్తి పట్టుకుని రౌద్రంతో ఆయన ఉన్న లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. దీపావళికి టీజర్‌ను విడుదల చేయనున్నారు. రవి బసృర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.