వ్యాక్సిన్‌కు భయపడవద్దు: ఉపాసన కొణిదెల

ABN , First Publish Date - 2021-01-28T23:05:11+05:30 IST

కొన్ని నెలల నుంచి జన జీవనాన్ని గడగడలాడించిన, ఆడిస్తున్న రక్కసి కరోనా. ఈ మహమ్మారికి వ్యాక్సిన్‌ వచ్చిందని అంతా సంతోషంలో ఉంటే.. కొన్ని చోట్ల

వ్యాక్సిన్‌కు భయపడవద్దు: ఉపాసన కొణిదెల

కొన్ని నెలల నుంచి జన జీవనాన్ని గడగడలాడించిన, ఆడిస్తున్న రక్కసి కరోనా. ఈ మహమ్మారికి వ్యాక్సిన్‌ వచ్చిందని అంతా సంతోషంలో ఉంటే.. కొన్ని చోట్ల మాత్రం వ్యాక్సిన్‌పై అనేకానేక వార్తలు ప్రచారమవుతున్నాయి. కరోనా రక్కసి నుండి కాపాడుకోవడం కోసం ఇటీవలే వచ్చిన వ్యాక్సిన్ విషయంలో ఇప్పటికే పలువురు ముందుకొచ్చి దైర్యంగా వ్యాక్సిన్ వేయించుకుంటే మరికొందరు ఈ విషయంలో వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తాను వ్యాక్సిన్ వేయించుకోవడమే కాకుండా తన హాస్పిటల్ ఫ్రంట్ లైన్ వర్కర్స్‌ను కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. ఈ వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి అపోహలు వద్దని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలని, అప్పుడే కరోనా మహమ్మరి నుంచి బయటపడతామని ఆమె తెలిపారు.



Updated Date - 2021-01-28T23:05:11+05:30 IST