రొటీన్‌కు భిన్నంగా...

ABN , First Publish Date - 2021-12-27T06:26:48+05:30 IST

‘శ్యామ్‌సింగరాయ్‌’ ఫేమ్‌ రవితేజ్‌, మిస్‌ మహారాష్ట్రగా గెలుపొందిన అనితా షిండే జంటగా రూపొందుతున్న చిత్రం ‘దిల్‌ తో పాగల్‌ హై’. ఆదివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది...

రొటీన్‌కు భిన్నంగా...

‘శ్యామ్‌సింగరాయ్‌’ ఫేమ్‌ రవితేజ్‌, మిస్‌ మహారాష్ట్రగా గెలుపొందిన అనితా షిండే జంటగా రూపొందుతున్న చిత్రం ‘దిల్‌ తో పాగల్‌ హై’. ఆదివారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీరంగం సతీష్‌ దర్శకత్వంలో ఎస్‌. సోమరాజు నిర్మిస్తున్నారు. ముహూర్తపు షాట్‌కి నిర్మాత, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ సెక్రటరీ ప్రసన్నకుమార్‌ క్లాప్‌ ఇచ్చారు. జైపాల్‌ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘‘రొటీన్‌కు భిన్నమైన స్టోరీ ఇది. సంక్రాంతి తర్వాత రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి మేలో విడుదల చేస్తాం’’ అన్నారు. చిత్ర నిర్మాత మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కథ బాగా నచ్చింది. అందుకే ఖర్చుకు వెనుకాడకుండా నిర్మిస్తున్నాం. ఇకనుంచి మా బేనర్‌లో వరుసగా సినిమాలు తీస్తాం’’ అని చెప్పారు. 


Updated Date - 2021-12-27T06:26:48+05:30 IST