సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

విడుదలకు అంకుల్స్‌ రెడీ

ABN, First Publish Date - 2021-07-26T09:26:46+05:30

రాజారవీంద్ర, మనో, శ్రీముఖి ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న హాస్యరస ప్రధాన చిత్రం ‘క్రేజీ అంకుల్స్‌’. ఈ. సత్తిబాబు దర్శకత్వంలో గుడ్‌ ఫ్రెండ్స్‌, బొడ్డు అశోక్‌ సంయుక్తంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజారవీంద్ర, మనో, శ్రీముఖి ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న హాస్యరస ప్రధాన చిత్రం ‘క్రేజీ అంకుల్స్‌’. ఈ. సత్తిబాబు దర్శకత్వంలో గుడ్‌ ఫ్రెండ్స్‌, బొడ్డు అశోక్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం నుంచి ‘క్రేజీ అంకుల్స్‌...’ అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ను ఆదివారం చిత్రబృందం విడుదల చేసింది. కాసర్ల శ్యామ్‌ అందించిన సాహిత్యానికి రఘుకుంచె స్వరాలు సమకూర్చగా లిప్సిక ఆలపించారు. ఈ సందర్భంగా రాజా రవీంద్ర మాట్లాడుతూ ‘‘ముగ్గురు మధ్య వయస్కులు ఓ అమ్మాయి చుట్టూ తిరిగే కథతో ఈ చిత్రం రూపొందింది. ఈ కథ ఆద్యంతం హాస్యంతో నవ్విస్తుంది. వ్యంగ్యం, వినోదం కలబోసిన సినిమా ఇది’’ అని చెప్పారు. శ్రీముఖి మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంలో నాది నటనకు ఆస్కారమున్న పాత్ర. కుటుంబ ప్రేక్షకులకు నన్ను దగ్గరచేస్తుంది’’ అని అన్నారు. భరణి, హేమ ప్రధాన పాత్రలు పోషించారు. రఘు కుంచె సంగీతం అందించారు. 


Updated Date - 2021-07-26T09:26:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!