రూ. రెండు కోట్ల విరాళం
ABN, First Publish Date - 2021-06-20T06:08:18+05:30
తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి ‘కత్తి’, ‘నవాబ్’, ‘2.0’, ‘దర్బార్’ చిత్రాల నిర్మాత, లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ రూ. రెండు కోట్లు విరాళం అందజేశారు...
తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి ‘కత్తి’, ‘నవాబ్’, ‘2.0’, ‘దర్బార్’ చిత్రాల నిర్మాత, లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ రూ. రెండు కోట్లు విరాళం అందజేశారు. శనివారం తమిళనాడు సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసిన లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు చెక్ అందజేశారు. కరోనా బాధితుల సహాయక చర్యల కోసం ఈ మొత్తాన్ని అందజేశామని లైకా ప్రతినిధులు జీకేఎం తమిళ్ కుమరన్, గౌరవ్, నిరుతన్ తెలిపారు. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్ సెల్వన్’, అక్షయ్‌కుమార్‌తో ‘రామసేతు’ సహా మరో నాలుగు చిత్రాలను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.