చేయనని చెప్పాలనుకున్నా -నాని

ABN , First Publish Date - 2021-04-03T04:44:19+05:30 IST

నాని హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించిన చిత్రం ‘టక్‌ జగదీష్‌’. రీతూవర్మ, ఐశ్వర్యారాజేశ్‌ నాయికలు. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకొస్తుందీ సినిమా. ఇటీవల ట్రైలర్‌...

చేయనని చెప్పాలనుకున్నా -నాని

నాని హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించిన చిత్రం ‘టక్‌ జగదీష్‌’. రీతూవర్మ, ఐశ్వర్యారాజేశ్‌ నాయికలు. ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకొస్తుందీ సినిమా. ఇటీవల ట్రైలర్‌ రిలీజ్‌ పోస్టర్‌ను నాని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘మన ప్రాంత మట్టి వాసనతో నిండిన చక్కని తెలుగు చిత్రమిది. ఈ కథ వినడానికి వెళ్లేటప్పుడు శివ ప్రేమకథ చెబుతాడేమో.. చేయనని చెబుదామనుకున్నా. 10 నిమిషాలు కథ వినగానే కాదనలేకపోయా’’ అని అన్నారు. ‘‘ఏ చిత్రానికి ఇది ప్రేరణ కాదు’’ అని దర్శకుడు తెలిపారు. ఈ 13న వైజాగ్‌లో ట్రైలర్‌ను విడుదల చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. 

Updated Date - 2021-04-03T04:44:19+05:30 IST