పుట్టిన‌రోజు ట్రీట్ ఇవ్వ‌నున్న `ట‌క్ జ‌గ‌దీష్‌`

ABN , First Publish Date - 2021-02-21T02:23:45+05:30 IST

'నిన్నుకోరి' వంటి సూపర్‌హిట్‌ తర్వాత నేచురల్‌ స్టార్‌ నాని, డైరెక్టర్‌ శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'టక్‌ జగదీష్‌'. ఫిబ్ర‌వ‌రి 23న నాని పుట్టిన‌రోజు సంద‌ర్భంగా టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నాని, స‌హా నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ వెల్ల‌డించింది.

పుట్టిన‌రోజు ట్రీట్ ఇవ్వ‌నున్న `ట‌క్ జ‌గ‌దీష్‌`

'నిన్నుకోరి' వంటి సూపర్‌హిట్‌ తర్వాత నేచురల్‌ స్టార్‌ నాని, డైరెక్టర్‌ శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'టక్‌ జగదీష్‌'. 'మజిలీ' వంటి సూపర్‌ హిట్‌ తర్వాత శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న చిత్రమిది. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. `షైన్ స్క్రీన్స్` బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  నాని హీరోగా నటిస్తోన్న 26వ చిత్రమిది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.  ఫిబ్ర‌వ‌రి 23న నాని పుట్టిన‌రోజు సంద‌ర్భంగా టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నాని, స‌హా నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ వెల్ల‌డించింది. దీనికి సంబంధించిన ఓ మోష‌న్ పోస్ట‌ర్‌ను కూడా సంస్థ షేర్ చేసింది. 



Updated Date - 2021-02-21T02:23:45+05:30 IST