మహేశ్‌తో త్రివిక్రమ్‌ చర్చలు!

ABN , First Publish Date - 2021-12-27T23:55:47+05:30 IST

‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత మరోసారి మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ సెట్‌ అయిన సంగతి తెలిసిందే! కొన్నేళ్లగా వీరిద్దరి కలయికలో సినిమా ఉంటుంది అనే వార్తలు వినిపిస్తున్నా.. ఎప్పుడు పట్టాలెక్కుతుందో అన్న అనుమానం లేకపోలేదు. ఆ అనుమానాలకు తెర దించుతూ హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే.

మహేశ్‌తో త్రివిక్రమ్‌ చర్చలు!

‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత మరోసారి మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ సెట్‌ అయిన సంగతి తెలిసిందే! కొన్నేళ్లగా వీరిద్దరి కలయికలో సినిమా ఉంటుంది అనే వార్తలు వినిపిస్తున్నా.. ఎప్పుడు పట్టాలెక్కుతుందో అన్న అనుమానం లేకపోలేదు. ఆ అనుమానాలకు తెర దించుతూ హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతోంది అన్న అనుమానమూ ఉంది. దీనిపై చిత్ర బృందం మరోసారి క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం మహేశ్‌ దుబాయ్‌లో ఉన్నారు. అక్కడ త్రివిక్రమ్‌, నాగ వంశీ తమన్‌ మహేశ్‌ను కలిశారు. కథకు సంబంధించిన చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు మహేశ్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ‘‘వర్క్‌ అండ్‌ చిల్‌ విత్‌ టీమ్‌’ అంటూ ట్వీట్‌ చేశారు. అయితే త్రివిక్రమ్‌తో హ్యాట్రిక్‌కు మహేశ్‌ సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో మహేశ్‌ ఉన్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్‌, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమాలు మొదలయ్యే అవకాశం ఉంది. 

Updated Date - 2021-12-27T23:55:47+05:30 IST