త్రిష సినిమా ఓటీటీలో.. విడుదల ఎప్పుడంటే

ABN , First Publish Date - 2021-02-02T23:52:19+05:30 IST

త్రిష నటించిన తొలి మలయాళ చిత్రం ఓటీటీలో విడుదల కాబోతోంది. త్రిష, నివిన్‌ పాలీ జంటగా నటించిన మలయాళ చిత్రాన్ని

త్రిష సినిమా ఓటీటీలో.. విడుదల ఎప్పుడంటే

త్రిష నటించిన తొలి మలయాళ చిత్రం ఓటీటీలో విడుదల కాబోతోంది. త్రిష, నివిన్‌ పాలీ జంటగా నటించిన మలయాళ చిత్రాన్ని 'హే జూడ్‌' పేరుతో తెలుగులో ప్రేక్షకులకు ఓ ఓటీటీ సంస్థ అందించబోతోంది. 'పిజ్జా 2' వంటి థ్రిల్లర్ సినిమాను తన తొలి ప్రీమియర్‌గా ప్రదర్శించిన ఫిలిం ఓటీటీ.. ఇప్పుడు 'హే జూడ్‌' చిత్రాన్ని విడుదలచేయనుంది. ఈ చిత్ర ప్రీమియర్‌ డేట్‌ను కూడా ప్రకటించారు. ఫిబ్రవరి 5న ఈ చిత్ర ప్రీమియర్‌ను టెలికాస్ట్ చేయనున్నారు.


2018లో మాలీవుడ్‌లో రిలీజైన 'హే జూడ్' చిత్రం రొమాంటిక్ కామెడీ చిత్రంగా విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంది. ఈ చిత్రాన్ని శ్యామ్ ప్రసాద్ రూపొందించారు. త్వరలో మరిన్ని సూపర్ హిట్ చిత్రాలు ప్రీమియర్‌ కానున్నాయని ఫిలిం ఓటీటీ తెలియజేస్తుంది. మలయాళ స్టార్ మమ్ముట్టి రంగూన్ రౌడీ, ప్రియమణి నటించిన విస్మయతో పాటు పలు తెలుగు క్లాసిక్ చిత్రాలను ప్రదర్శించేందుకు ఫిలిం ఓటీటీ రెడీ అవుతోంది. 

Updated Date - 2021-02-02T23:52:19+05:30 IST