‘పుష్పక విమానం’.. ట్రైలర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్
ABN , First Publish Date - 2021-10-27T22:20:22+05:30 IST
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సమర్పణలో కింగ్ ఆఫ్ ది హిల్’ ఎంటర్టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘పుష్పక విమానం’. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, గీతా శైనీ, శాన్వి మేఘన హీరోహీరోయిన్లుగా

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సమర్పణలో కింగ్ ఆఫ్ ది హిల్’ ఎంటర్టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘పుష్పక విమానం’. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, గీతా శైనీ, శాన్వి మేఘన హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు దామోదర దర్శకత్వంలో గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తుండటం విశేషం. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఆంధ్రా, సీడెడ్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండగా, నైజాంలో గ్లోబల్ సినిమాస్ రిలీజ్ చేస్తోంది. ఓవర్సీస్ లో ఫ్రీజ్ ఫ్రేమ్ ఫిలింస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ప్రతీది మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ నెల 30న చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ సినిమాపై మంచి హైప్‌ని క్రియేట్ చేస్తున్నారు.