విష పూరితం
ABN , First Publish Date - 2021-11-01T06:40:07+05:30 IST
రమణ, షఫీ, కమల్, అమిత్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘పాయిజన్’. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కించారు. రవిచంద్రన్ దర్శకుడు...

రమణ, షఫీ, కమల్, అమిత్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘పాయిజన్’. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కించారు. రవిచంద్రన్ దర్శకుడు. శిల్పిక కె. నిర్మాత. ఆదివారం హైదరాబాద్‌లోని ‘మ్యాడ్’ అనే గీతాన్ని కథానాయకుడు శ్రీకాంత్ విడుదల చేశారు. ‘‘ఈ పాట చాలా బాగుంది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఈ చిత్రంలో నటించిన రమణ నాకు సోదర సమానుడు. తనకు మంచి విజయాన్ని అందించాల’’న్నారు శ్రీకాంత్. ‘‘ముంబై, పూణె, లోనావాలా తదితర ప్రాంతాలలో చిత్రీకరణ జరిపామ’’న్నారు నిర్మాత.