కింగ్ 'నాగ్'కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ
ABN , First Publish Date - 2021-08-29T17:23:08+05:30 IST
టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున నేడు (ఆగస్ట్ 29) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తనయులు, కుటుంబ సభ్యులనుంచి, అలాగే టాలీవుడ్ స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి,

టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున నేడు (ఆగస్ట్ 29) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తనయులు, కుటుంబ సభ్యులనుంచి, అలాగే టాలీవుడ్ స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబు, యంగ్ హీరో శర్వానంద్, నటుడు - దర్శకుడు రాహుల్ రవీంద్రన్, యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల సహా పలువురు కింగ్ 'నాగ్'కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదే క్రమంలో ఆయన హీరోగా నటిస్తున్న 'ది ఘోస్ట్' చిత్ర బృందం కూడా తాజాగా చిత్ర టైటిల్ అలాగే నాగ్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి విషెస్ తెలిపారు.