అశోక్‌ గల్లా మూవీ టైటిల్‌ టీజర్‌ రిలీజ్‌ ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2021-06-20T22:49:40+05:30 IST

సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, మహేశ్‌బాబు మేనల్లుడు, గుంటూరు జిల్లా ఏంపీ జయదేవ్‌ గల్లా తనయుడు అశోక్‌ గల్లా హీరోగా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ‘దేవదాస్‌‌’ ఫేమ్‌ శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో

అశోక్‌ గల్లా మూవీ టైటిల్‌ టీజర్‌ రిలీజ్‌ ఎప్పుడంటే?

సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, మహేశ్‌బాబు మేనల్లుడు, గుంటూరు జిల్లా ఏంపీ జయదేవ్‌ గల్లా తనయుడు అశోక్‌ గల్లా హీరోగా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ‘దేవదాస్‌‌’ ఫేమ్‌ శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని  అమర రాజ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. డిఫరెంట్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అశోక్‌ గల్లా సరసన ఇస్మార్ట్‌ భామ నిధీ అగర్వాల్‌ నటిస్తోంది. జగపతిబాబు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నరేష్, సత్య, అర్చన సౌందర్య కీలక పాత్రధారులు. ఈ సినిమా టైటిల్‌ టీజర్‌ను ఈ నెల 23న విడుదల చేయనున్నట్లు అధికారికంగా తెలియజేస్తూ.. చిత్రయూనిట్‌ ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. అశోక్‌ గల్లా గుర్రపు స్వారీ చేస్తున్నట్లుగా ఈ పోస్టర్‌లో కనిపిస్తోంది. ఇంతకు ముందు ఈ సినిమాకు సంబంధించి సూపర్‌ స్టార్‌ కృష్ణ బర్త్‌డేని పురస్కరించుకుని విడుదల చేసిన 'జుంబారే.' సాంగ్‌ టీజర్‌ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే.

Updated Date - 2021-06-20T22:49:40+05:30 IST