వినోదం మూడు రెట్లు

ABN , First Publish Date - 2021-12-14T06:46:39+05:30 IST

వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ కలసి ఈ సారి మూడు రెట్ల వినోదాన్ని అందించడం కోసం ‘ఎఫ్‌ 3’ సినిమాతో రానున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో...

వినోదం మూడు రెట్లు

వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ కలసి ఈ సారి మూడు రెట్ల వినోదాన్ని అందించడం కోసం ‘ఎఫ్‌ 3’ సినిమాతో రానున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో  రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. వెంకటేశ్‌ బర్త్‌ డే సందర్భంగా సోమవారం ఆయన పోస్టర్‌తో బర్త్‌డే  గ్లింప్స్‌ విడుదల చేశారు. తమన్నా, మెహరీన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్రప్రసాద్‌, సునీల్‌ కూడా ఉండడంతో ఈ సినిమా వినోదాత్మకంగా తయారవుతోందని దర్శకనిర్మాతలు చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో  జరుగుతున్న షెడ్యూల్‌లో చిత్ర తారాగణమంతా పాల్గొంటున్నారు.         


Updated Date - 2021-12-14T06:46:39+05:30 IST