ఈసారి ఏకగ్రీవంగా...

ABN , First Publish Date - 2021-11-16T05:47:29+05:30 IST

తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడిగా ప్రతాని రామకృష్ణ గౌడ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్‌ ఛైర్మన్‌గా గురురాజ్‌, డి. కోటేశ్వరరావు, నెహ్రూజీ, సెక్రటరీగా సాయి వెంకట్‌, వెంకటేశ్వరరావులను సభ్యులు...

ఈసారి ఏకగ్రీవంగా...

తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడిగా ప్రతాని రామకృష్ణ గౌడ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్‌ ఛైర్మన్‌గా గురురాజ్‌, డి. కోటేశ్వరరావు, నెహ్రూజీ, సెక్రటరీగా సాయి వెంకట్‌, వెంకటేశ్వరరావులను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ప్రతాని మాట్లాడుతూ ‘‘ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కోసం ఇది వరకు చాలా మంచి పనులు చేశాం. ఇక మీదటా వాటిని కొనసాగిస్తాం. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ని కలిశాం. ఇళ్ల స్థలాల కోసం త్వరలో పది ఎకరాల భూమిని ఇస్తామని ఆయన మాటిచ్చారు. త్వరలో సినీ ప్రముఖుల మధ్య ప్రమాణ స్వీకారం చేస్తామ’’న్నారు.  


Updated Date - 2021-11-16T05:47:29+05:30 IST