అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే
ABN , First Publish Date - 2021-12-29T05:37:07+05:30 IST
‘ఈ మధ్యకాలంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన కొంతమంది వ్యక్తులు పరిశ్రమ గురించి అనేక విషయాలు ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడుతున్నారు....

తెలుగు చలనచిత్ర నిర్మాతలమండలి
‘ఈ మధ్యకాలంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన కొంతమంది వ్యక్తులు పరిశ్రమ గురించి అనేక విషయాలు ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. వాటి వల్ల పరిశ్రమలోనే కాకుండా ప్రజల్లో కూడా గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి అటువంటి ప్రెస్‌మీట్స్‌లో చిత్రపరిశ్రమ, దాని విభాగాల గురించి ఏ వ్యక్తి ఏది మాట్లాడినా అది వారి వ్యక్తిగత అభిప్రాయమని గమనించాలి’ అంటూ తెలుగు చలనచిత్ర నిర్మాతలమండలి కార్యదర్శులు ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు ఫిల్మ్ చాంబర్, తెలుగు చలనచిత్ర నిర్మాతలమండలి, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్, దాని అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు ప్రెస్‌మీట్స్‌లో కానీ, మరే ఇతర సభలలో కానీ చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడిన విషయాలు మాత్రమే చిత్ర పరిశ్రమకు సంబంధించిన అంశాలుగా పరిగణించాలని ఆ ప్రకటనలో వారు కోరారు.