హీరోల వ్యాఖ్యలతో ఇబ్బంది పడుతున్నాం: థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు
ABN , First Publish Date - 2021-12-27T22:04:09+05:30 IST
సినీ హీరోల వ్యాఖ్యలతో ఇబ్బందులు పడుతున్నట్లుగా చెప్పుకొచ్చారు ఏపీ థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు. సినిమా థియేటర్లలో రేట్ల విషయమై ప్రభుత్వంతో డైరెక్ట్‌గా చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నట్లుగా సోమవారం వారు

సినీ హీరోల వ్యాఖ్యలతో ఇబ్బందులు పడుతున్నట్లుగా చెప్పుకొచ్చారు ఏపీ థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు. సినిమా థియేటర్లలో రేట్ల విషయమై ప్రభుత్వంతో డైరెక్ట్‌గా చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నట్లుగా సోమవారం వారు ప్రకటించారు. ఇప్పటికే తమకు అపాయింట్మెంట్ ఇవ్వాలని సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నానిని వారు కోరినట్లుగా తెలుస్తోంది. సినిమా థియేటర్ల రేట్లపై పలువురు సినీ హీరోల వ్యాఖ్యలతో తాము ఇబ్బందులు పడుతోన్నట్లుగా తెలిపిన థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు.. ప్రభుత్వంతో చర్చలకు తామే వస్తామని.. తమ సమస్యలు చెప్పుకునేందుకు సమయం ఇవ్వాలని మంత్రి పేర్ని నానిని వారు కోరారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి వారు కబురు పంపారు. కాగా, మంగళవారం మంత్రి పేర్ని నానిని థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు కలవబోతున్నట్లుగా తాజాగా సమాచారం అందుతోంది.