నాలుగు జంటల కథ

ABN , First Publish Date - 2021-11-01T06:39:08+05:30 IST

సాధ్యం, వసూల్‌రాజా, లక్ష్మీబాంబ్‌ చిత్రాలతో ఆకట్టుకున్నారు కార్తికేయ కొమ్మి. ప్రస్తుతం ‘దూరదర్శిని’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు....

నాలుగు జంటల కథ

సాధ్యం, వసూల్‌రాజా, లక్ష్మీబాంబ్‌ చిత్రాలతో ఆకట్టుకున్నారు కార్తికేయ కొమ్మి. ప్రస్తుతం ‘దూరదర్శిని’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు మరో చిత్రానికీ శ్రీకారం చుట్టేశారు.  నలుగురు కథానాయకులు, నలుగురు నాయికలతో ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నారు. నిర్మాతలు పాశం కేశవ్‌, శివ మాట్లాడతూ ‘‘నాలుగు జంటల కథ ఇది. వైవిఽధ్యభరితంగా ఉంటుంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నాం. డిసెంబరు నుంచి చిత్రీకరణ మొదలెడతాం. విజయ్‌ కుమార్‌, శరత్‌ కుమార్‌, జయ ప్రకాష్‌, హర్ష కీలక పాత్రలు పోషిస్తార’’న్నారు.


Updated Date - 2021-11-01T06:39:08+05:30 IST