హాలీవుడ్లో తొలి అడుగు
ABN , First Publish Date - 2021-11-27T09:06:28+05:30 IST
కథానాయిక సమంత కెరీర్లో మరో మైలురాయి ఇది. ఇప్పటి వరకూ దక్షిణాదిలో అగ్ర కథానాయికగా రాణించిన సమంత, ఇప్పుడు హాలీవుడ్లో అడుగుపెట్టేశారు...
కథానాయిక సమంత కెరీర్లో మరో మైలురాయి ఇది. ఇప్పటి వరకూ దక్షిణాదిలో అగ్ర కథానాయికగా రాణించిన సమంత, ఇప్పుడు హాలీవుడ్లో అడుగుపెట్టేశారు. ‘అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ అనే ఆంగ్ల చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ఫిలిప్ జాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని సమంత అధికారికంగా ప్రకటించింది. ‘‘ఇది సరికొత్త ప్రపంచం. ఈ చిత్రంలో భాగమైనందుకు సంతోషిస్తున్నా. అను పాత్ర కోసం నన్ను ఎంచుకున్నందుకు దర్శకుడు ఫిలిప్ జాన్‌కు థ్యాంక్యూ. ఈ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని ట్వీట్ చేసింది సమంత.