2022లో మొదట విడుదలయ్యే చిత్రం మాదే: వరుణ్ సందేశ్
ABN , First Publish Date - 2021-12-28T15:54:13+05:30 IST
యువ హీరో వరుణ్ సందేశ్ తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. జనవరి 1వ తేదీన 'ఇందువదన' చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో స్వామి వారీ ఆశీస్సులు పొందేందుకు చిత్ర బృందంతో కలిసి తిరుమలకు చేరుకున్న

యువ హీరో వరుణ్ సందేశ్ తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. జనవరి 1వ తేదీన 'ఇందువదన' చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో స్వామి వారీ ఆశీస్సులు పొందేందుకు చిత్ర బృందంతో కలిసి తిరుమలకు చేరుకున్న వరుణ్.. విఐపి బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం పలకగా, ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. 2022లో మొదట విడుదలయ్యే చిత్రం తమదేనని... ప్రేక్షకులు, శ్రీవారి ఆశీస్సులతో చిత్రం విజయం సాధిస్తుందని అన్నారు. ఇక 'డైమండ్ రాజా' అనే మరో చిత్రంలో నటిస్తున్నాని తెలిపారు.