పల్లెటూరి కోసం పోరాటం
ABN , First Publish Date - 2021-09-26T05:30:00+05:30 IST
సోలమన్ జడ్సన్, రాజ్‌బాలా, మనోచిత్ర, అనన్యమణి ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘రామ్ వర్సెస్ రావణ్’. దర్శకుడు కె. శుక్రన్ మాట్లాడుతూ ..
సోలమన్ జడ్సన్, రాజ్‌బాలా, మనోచిత్ర, అనన్యమణి ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘రామ్ వర్సెస్ రావణ్’. దర్శకుడు కె. శుక్రన్ మాట్లాడుతూ ‘‘రాజమౌళి గారి దగ్గర ‘బాహుబలి’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేశాను. పల్లెటూరి కోసం ఇద్దరు యువకులు జరిపిన పోరాటం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి కామెడీ ఉంటుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని సోలమన్ జడ్సన్ చెప్పారు. సప్తగిరి కీలకపాత్ర పోషిస్తున్నారు. డాక్టర్ ఏ. ఎస్. జడ్సన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.