ప్రేక్షకులు ఘన విజయాన్ని ఇచ్చారు

ABN , First Publish Date - 2021-11-01T06:43:06+05:30 IST

‘‘కుటుంబ ప్రేక్షకులకు ‘వరుడు కావలెను’ చిత్రం బాగా నచ్చింది. ఈ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరైనందుకు సంతోషంగా ఉంది. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది....

ప్రేక్షకులు ఘన విజయాన్ని ఇచ్చారు

‘‘కుటుంబ ప్రేక్షకులకు ‘వరుడు కావలెను’ చిత్రం బాగా నచ్చింది. ఈ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరైనందుకు సంతోషంగా ఉంది. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ఇంత ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు మా చిత్రబృందం తరపున కృతజ్ఞతలు’’ అని నాగశౌర్య అన్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌ మీట్‌ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకురాలు లక్ష్మీసౌజన్య మాట్లాడుతూ ‘‘మంచి సినిమా తీసి ప్రేక్షకులకు నా పై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. అన్ని వర్గాల ప్రేక్షకులు హాయిగా చూసే సినిమా’’ అని తెలిపారు. చిత్ర నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ‘‘వరుడు కావలెను’తో ఒక క్లీన్‌ మూవీ చేశాం. అన్ని సెంటర్ల నుంచి సూపర్‌హిట్‌ టాక్‌ వస్తోంది. ప్రతి షోకు థియేటర్లలో ఆక్యుపెన్సీ పెరుగుతోంది’ అని చెప్పారు. 


Updated Date - 2021-11-01T06:43:06+05:30 IST