సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

'తలైవి' ట్రైలర్‌ డేట్ ఫిక్స్‌

ABN, First Publish Date - 2021-03-20T18:36:56+05:30

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ 'తలైవి'. మార్చి 23న కంగనా రనౌత్‌ పుట్టినరోజు సందర్భంగా 'తలైవి' ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ 'తలైవి'. బాలీవుడ్ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్రలో నటించారు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది. మార్చి 23న కంగనా రనౌత్‌ పుట్టినరోజు సందర్భంగా 'తలైవి' ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. అది కూడా రెండు ప్రధాన నగరాలైన చెన్నై, ముంబైలలో 'తలైవి' ట్రైలర్‌ను రిలీజ్‌ చేయడానికి ఏర్పాటు జరుగుతున్నాయి. కంగనా రనౌత్‌, అరవింద స్వామి, నిర్మాతలు విష్ణు ఇందూరి, శైలేష్‌ ఆర్‌.సింగ్‌ ట్రైలర్‌ రిలీజ్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎ.ఎల్‌.విజయ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఎంజీఆర్‌ పాత్రలో అరవింద స్వామి నటించారు. జీవీ ప్రకాశ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌ కరుణానిధి పాత్రలో నటించగా.. జయలలిత నిచ్చెలి శశికళ పాత్రలో పూర్ణ నటించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 23న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. 

Updated Date - 2021-03-20T18:36:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!