సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఏపీ ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన తెలుగు డిస్ట్రిబ్యూట‌ర్స్ కౌన్సిల్

ABN, First Publish Date - 2021-12-30T18:47:13+05:30

ఏపీలో థియేటర్ల ఓనర్లకు ఊరట క‌లిగింది. సీల్ చేసిన థియేటర్లు తిరిగి ఒపెన్ చేసేందుకు అనుమ‌తినిచ్చిన ప్ర‌భుత్వానికి తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్ కౌన్సిల్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీలో థియేటర్ల ఓనర్లకు ఊరట క‌లిగింది. వివిధ కారణాలతో ఇటీవల అధికారులు మూసివేసిన థియేటర్లను తిరిగి ఓపెన్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వానికి తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్ కౌన్సిల్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. ‘ఏపీ సర్కారుకు తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్ తరపున మేం కొన్ని వినతులు చేశాము. అందులో మొదటగా ఈ మధ్య అధికారులు పలు కారణాలతో మూసి వేసిన థియేటర్స్‌ను రీ ఓపెన్ చేయడానికి ప్రభుత్వం అంగీరించింది. మా విన్నపాన్ని మన్నించినందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి కృత‌జ్ఞ‌త‌లు తెలియజేస్తున్నాము. మిగిలిన అంశాలపై కూడా సత్వరమే సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం’ అని తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్ ఓ ప్రకటనను విడుదల చేసింది. 

Updated Date - 2021-12-30T18:47:13+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!