పునీత్‌కు కన్నీటి వీడ్కోలు
ABN , First Publish Date - 2021-11-01T06:49:03+05:30 IST
కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు, వేలాదిమంది అభిమానులు బాధాతప్త హృదయాలతో కన్నీటి వీడ్కోలు మధ్య అధికార లాంఛనాలతో కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ముగిశాయి....

కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు, వేలాదిమంది అభిమానులు బాధాతప్త హృదయాలతో కన్నీటి వీడ్కోలు మధ్య అధికార లాంఛనాలతో కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం ఉదయం బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో ఆయన తల్లిదండ్రుల సమాధుల పక్కనే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పునీత్ అన్న కుమారుడు వినయ్ ఈ ప్రక్రియను పూర్తి చేశారు. అంత్యక్రియల్లో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ సీఎం యడియూరప్ప, ప్రతిపక్ష నేత సిద్దరామయ్య, సినీ ప్రముఖులు పాల్గొని నివాళి అర్పించారు. బసవరాజ్ బొమ్మై కడపటి నివాళిగా పునీత్ నుదుటిని ముద్దాడారు. స్టేడియం నుంచి కంఠరీవ స్టూడియో వరకు భారీ కాన్వాయ్ మధ్య వేలాది మంది అభిమానుల సమక్షంలో పునీత్ అంతిమయాత్ర సాగింది. శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు పునీత్ రాజ్‌కుమార్‌కు 10 లక్షల మందికిపైగా అభిమానులు నివాళులు అర్పించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంత్యక్రియలు జరిగిన కంఠీరవ స్టూడియో చుట్టుపక్కల 144 సెక్షన్ విధించారు.
ఆంధ్రజ్యోతి, బెంగళూరు