తప్పుచేసి... దొరికిపోయారు!

ABN , First Publish Date - 2021-12-14T06:45:26+05:30 IST

నివేదా థామస్‌, రెజీనా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘శాకిని..డాకిని’ చిత్రం షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది...

తప్పుచేసి... దొరికిపోయారు!

నివేదా థామస్‌, రెజీనా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘శాకిని..డాకిని’ చిత్రం షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. రెజీనా పుట్టిన రోజు సందర్భంగా సోమవారం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. మిలటరీ యూని ఫామ్‌లో ఉన్న నివేదా, రెజీనా ఏదో తప్పు చేసి దొరికిపోయి, పనిష్మెంట్‌ తీసుకుంటున్నట్లున్న ఈ పోస్టర్‌ సినిమా మీద ఆసక్తి పెంచుతోంది.  ఈ హీరోయిన్లు ఇద్దరూ తొలిసారిగా ఈ చిత్రంలో యాక్షన్‌ సన్నివేశాల్లో పాల్గొనడం విశేషం. 


‘ఓ బేబీ’ వంటి సూపర్‌ హిట్‌ మూవీ తర్వాత సురేశ్‌బాబు, సునీత తాటి, హ్యూన్‌ వ్యూ థామస్‌ కిమ్‌ నిర్మిస్తున్న  చిత్రం ‘శాకిని డాకిని’. సుధీర్‌ వర్మ దర్శకుడు. ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’ చిత్రం ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్‌: అక్షయ్‌ పూళ్ల, సంగీతం: మిక్కీ మెల్ర్కెరీ, ఎడిటర్‌: విప్లవ్‌ నైషధం, ఫొటోగ్రఫీ: రిచర్డ్‌ ప్రసాద్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ శంకర్‌ దొంకడ.

Updated Date - 2021-12-14T06:45:26+05:30 IST