నేపథ్య గాయకుడు కన్నుమూత
ABN , First Publish Date - 2021-12-27T14:43:57+05:30 IST
ప్రముఖ నేపథ్య గాయకుడు మాణిక్ వినాయకం ఆదివారం గుండెపోటుకు గురై మృతి చెందారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. ఆయన నటుడిగానూ తిరుడాతిరుడి, సంతోషం సుబ్రమణ్యం తదితర చిత్రాల్లో నటించారు. 2001లో

చెన్నై: ప్రముఖ నేపథ్య గాయకుడు మాణిక్ వినాయకం ఆదివారం గుండెపోటుకు గురై మృతి చెందారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. ఆయన నటుడిగానూ తిరుడాతిరుడి, సంతోషం సుబ్రమణ్యం తదితర చిత్రాల్లో నటించారు. 2001లో ‘దిల్’ చిత్రంలో కన్నుక్కుల్ ఒరుత్తి అనే పాట ద్వారా తమిళ చిత్రసీమకు గాయకుడిగా పరిచయమయ్యారు. 1500కు పైగా ప్రైవేటు భక్తిగీతాలు, సినిమా పాటలు పాడారు.