అజిత్‌ రూ. 25 లక్షల సాయం

ABN , First Publish Date - 2021-05-15T04:16:04+05:30 IST

కొవిడ్‌పై పోరాటంలో భాగంగా తనవంతు సాయం చేసేందుకు తమిళ నటుడు అజిత్‌ ముందుకొచ్చారు. శుక్రవారం తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి ఆయన రూ. 25 లక్షల....

అజిత్‌ రూ. 25 లక్షల సాయం

కొవిడ్‌పై పోరాటంలో భాగంగా తనవంతు సాయం చేసేందుకు తమిళ నటుడు అజిత్‌ ముందుకొచ్చారు. శుక్రవారం తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి ఆయన రూ. 25 లక్షల విరాళాన్ని అందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. అజిత్‌ ప్రస్తుతం హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో ‘వాలిమై’ చిత్రంలో నటిస్తున్నారు. ఎ. ఆర్‌ మురగదాస్‌, ఉదయనిధి స్టాలిన్‌ చెరో రూ. 25 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. ఇటీవల సూర్య, కార్తీ తమ తండ్రి శివకుమార్‌తో కలసి రూ. కోటి విరాళంగా ఇచ్చారు.

Updated Date - 2021-05-15T04:16:04+05:30 IST