తమిళ దర్శకుడు జీఎన్ రంగరాజన్ మృతి
ABN, First Publish Date - 2021-06-04T06:42:35+05:30
తమిళ దర్శకుడు జీఎన్ రంగరాజన్ (90) గురువారం ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. రజనీకాంత్, కమల్ హాసన్‌తో ఆయన చిత్రాలు చేశారు...
తమిళ దర్శకుడు జీఎన్ రంగరాజన్ (90) గురువారం ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. రజనీకాంత్, కమల్ హాసన్‌తో ఆయన చిత్రాలు చేశారు. ‘కల్యాణరామన్’, ‘మీందమ్ కోకిల’, ‘మహారసన్’, ‘కాదల్ మీంగళ్’ వంటి విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించారు. పలువురు తమిళ సినీ ప్రముఖులు రంగరాజన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ‘‘ఓ సోదరుణ్ణి కోల్పోయా. నేను చిత్ర పరిశ్రమలో ప్రవేశించినప్పటి నుంచి, ఆయన మరణించే వరకూ నాపై ఎంతో ప్రేమ చూపించారు. దర్శకుడిగా తనకంటూ ఓ పేరు తెచ్చుకున్నారు. నాతో హిట్ చిత్రాలు తీశారు. ప్రేక్షకులు ఇప్పటికీ ఆయన చిత్రాలను అభిమానిస్తారు. నా ఇంటికి ‘కమల్ ఇల్లమ్’ అని పేరు పెట్టింది ఆయనే’’ అని కమల్ పేర్కొన్నారు. జీఎన్ రంగరాజన్ కుమారుడు, జీయన్నార్ కుమారవేలన్ తమిళ చిత్రసీమలో దర్శకుడిగా కొనసాగుతున్నారు. ‘హరిదాస్’, ‘వాఘా’, ‘యువన్ యువతి’ చిత్రాలు తీశారు. ప్రస్తుతం అరుణ్ విజయ్ హీరోగా నటిస్తున్న ‘సినమ్’ చిత్రానికి కుమారవేలన్ దర్శకత్వం వహిస్తున్నారు.