తమన్నా అంగీకరించకపోతే వెంకటేశ్ అనుకున్నారట!
ABN , First Publish Date - 2021-08-14T00:31:51+05:30 IST
మిల్కీబ్యూటీ తమన్నా హోస్ట్‌గా కుకింగ్ రియాలిటీ షో రూపొందుతోంది. త్వరలోనే ఈ షో ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ టీవీలో ప్రసారం కానుంది. అయితే ఈ షోకి వ్యాఖ్యాతగా విక్టరీ వెంకటేశ్‌ను అనుకున్నారట. మొదట ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా అనుకున్నది తమన్నానే అయినా ఆమె ఇందుకు అంగీకరిస్తారో లేదో అనుమానం నిర్వాహకుల్లో ఉందట.
మిల్కీబ్యూటీ తమన్నా హోస్ట్‌గా కుకింగ్ రియాలిటీ షో రూపొందుతోంది. త్వరలోనే ఈ షో ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ టీవీలో ప్రసారం కానుంది. అయితే ఈ షోకి వ్యాఖ్యాతగా విక్టరీ వెంకటేశ్‌ను అనుకున్నారట. మొదట ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా అనుకున్నది తమన్నానే అయినా ఆమె ఇందుకు అంగీకరిస్తారో లేదో అనుమానం నిర్వాహకుల్లో ఉందట. ఈ షోకు భాగస్వామిగా వ్యవహరిస్తున్న డి.సురేశ్‌బాబును సంప్రదించి వెంకటేశ్ వ్యాఖ్యాతగా చేయాలని కోరారట. అయితే ఈ కుకింగ్ రియాలిటీ షోకు తమన్నా సరైన ఎంపిక అని సురేశ్‌బాబు సమర్థించి, ఆమెను సంప్రదిచడంతో తమన్నా అంగీకరిచారట. షూటింగ్ మొదలుపెట్టడానికి సరిగ్గా ఐదు రోజుల ముందు తమన్నా ఈ షోకు సైన్ చేశారట. ఆమెతో షూటింగ్ కొనసాగడం ఇప్పటికీ నమ్మశక్యంగా లేదని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే తమన్నా, వెంకటేశ్ కలిసి ‘ఎఫ్2’తో అలరించారు. తాజాగా ‘ఎఫ్3’ సినిమాలోనూ కలిసి నటిస్తున్నారు.