#Radhe shyam : రీరికార్డింగ్ కోసం రంగంలోకి తమన్
ABN , First Publish Date - 2021-12-27T14:42:13+05:30 IST
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘రాధేశ్యామ్’. వచ్చే ఏడాది జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కాబోతోంది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మాణం జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో చిత్ర బృందం ఉంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే ‘రాధేశ్యామ్’ చిత్రంలోని సంగీతం కోసం సరికొత్తగా ప్రయత్నిస్తున్నారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘రాధేశ్యామ్’. వచ్చే ఏడాది జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కాబోతోంది. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మాణం జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో చిత్ర బృందం ఉంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే ‘రాధేశ్యామ్’ చిత్రంలోని సంగీతం కోసం సరికొత్తగా ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా కోసం రెండు మ్యూజిక్ టీమ్స్ పనిచేస్తున్నాయి. సౌత్, నార్త్ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ తో పాటల్ని సిద్ధం చేశారు రాధేశ్యామ్ టీమ్. ఇప్పటికే ఇందులోని అన్ని పాటలకీ మంచి రెస్పాన్స్ వచ్చింది.
రాధేశ్యామ్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు జెస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుంటే.. మిథున్, అను మాలిక్, మనన్ భరద్వాజ్ హిందీ వెర్షన్ కు సంగీతం అందిస్తున్నారు. అయితే అన్ని భాషలకి ఆర్.ఆర్ కోసం తమన్ ను రంగంలోకి దింపుతున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో మాస్టర్ గా పేరు తెచ్చుకున్న తమన్.. ఇటీవల ‘క్రాక్, వకీల్ సాబ్, అఖండ’ చిత్రాలకు ఏ రేంజ్ నేపథ్య సంగీతం అందించారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే ‘రాధేశ్యామ్’ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం తమన్ వర్క్ స్టార్ట్ చేశాడు. ఈ విషయాన్ని అఫీషియల్ గా తెలుపుతూ ఓ ప్రత్యేక పోస్టర్ ను వదిలారు మేకర్స్.