తాప్సీ: మనల్ని మనం ఇష్టపడితేనే..!

ABN , First Publish Date - 2021-11-29T20:44:17+05:30 IST

మారుతున్న రోజులు, పెరుగుతున్న పోటీ.. ప్రపంచంలో ఏ సినీ తార అయినా కొత్తగానూ, ఆకట్టుకునేలానూ కనిపించాలనుకుంటారు. హీరోయిన్‌లకు అందం మరీ ముఖ్యం. అందుకోసం చేయని కసరత్తులు ఉండవు. అందంగా ఉంటే అవకాశాల నుంచి పారరితోషికం వరకూ అన్నీ కరెక్ట్‌గా ఉంటాయని తారల నమ్మకం. అందంగా కనిపించడం కోసం తాప్సీ చిన్నప్పటి నుంచీ చాలా కష్టపడుతూ వచ్చిందట.

తాప్సీ: మనల్ని మనం ఇష్టపడితేనే..!

మారుతున్న రోజులు, పెరుగుతున్న పోటీ.. ప్రపంచంలో ఏ సినీ తార అయినా కొత్తగానూ, ఆకట్టుకునేలానూ కనిపించాలనుకుంటారు. హీరోయిన్‌లకు అందం మరీ ముఖ్యం. అందుకోసం చేయని కసరత్తులు ఉండవు.  అందంగా ఉంటే అవకాశాల నుంచి పారరితోషికం వరకూ అన్నీ కరెక్ట్‌గా ఉంటాయని తారల నమ్మకం. అందంగా కనిపించడం కోసం తాప్సీ చిన్నప్పటి నుంచీ చాలా కష్టపడుతూ వచ్చిందట. తాజాగా ఓ ఇంగ్లిష్‌ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘‘నా కళ్లు పెద్దగా, చూడచక్కగా ఉండవు. నా ముక్కు సన్నగా ఉండదు. పెదవులు కూడా అందంగా కనిపించవు. జుట్టు కూడా రింగు రింగులుగా కనిపిస్తుండేది. దాంతో ఏం చేయాలో తెలియక సెలూన్‌కి వెళ్లి కెమికల్స్‌తో జుట్టుని అందంగా చేసుకునేదాన్ని. అలా రెండుమూడుసార్లు చేశాక జుట్టు రాలడం మొదలైంది. అంతే మళ్లీ దాని జోలికి వెళ్లలేదు. అందానికి సంబంధించి కొన్ని లెక్కలేసుకుంటే నేను దానికి సరిపోను. సంవత్సరాలుగా నన్ను నేను మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ విషయంలో సక్సెస్‌ కాలేకపోయా. జీవితాన్ని ప్రేమతో జీవించాలి. మనల్ని మనం ఇష్టపడితే బయట ప్రపంచానికి కూడా నచ్చుతాం. దానితో అందంపై నా అభిప్రాయం మారింది’’ అని తాప్సీ అందానికి సరైన సీక్రెట్‌ చెప్పారు. 

Updated Date - 2021-11-29T20:44:17+05:30 IST