విభిన్నంగా తాప్సీ ఫస్ట్‌లుక్!

ABN , First Publish Date - 2021-02-02T21:06:24+05:30 IST

వరుసగా కథా ప్రాధాన్యమున్న, వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ దూసుకుపోతోంది హీరోయిన్ తాప్సీ

విభిన్నంగా తాప్సీ ఫస్ట్‌లుక్!

వరుసగా కథా ప్రాధాన్యమున్న, వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ దూసుకుపోతోంది హీరోయిన్ తాప్సీ. నటనకు ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తూ ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు సంపాదించుకుంది. తాప్సీ నటిస్తున్న తాజా చిత్రం `లూప్ లాపెటా`. డార్క్ కామెడ్రీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ తాజాగా బయటకు వచ్చింది. 


చీకటిగా, మురికిగా ఉన్న బాత్రూమ్‌లో టాయిలెట్‌పై కూర్చుని ఉన్న తాప్సీ ఫొటో ఫస్ట్‌లుక్‌గా విడుదలైంది. `కొన్నిసార్లు జీవితంలో మనల్ని మనమే ప్రశ్నించుకోవాల్సిన సమయం వస్తుంది. `నేను ఇక్కడ ఎలా ఉన్నాను?` అని. నేను అంటుంది జీవితంలో గందరగోళం గురించి. హాయ్ నేను సవి. ఈ క్రేజీ రైడ్ కోసం సిద్ధం` అంటూ తాప్సీ పేర్కొంది. ఆకాష్ భాటియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న `లూప్ లాపెటా` చిత్రాన్ని సోనీ పిక్చర్స్, ఎలిప్సిన్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

Updated Date - 2021-02-02T21:06:24+05:30 IST