మెగాస్టార్ ‘ఆచార్య’ కు పోటీగా సూర్య పాన్ ఇండియా మూవీ
ABN , First Publish Date - 2021-12-14T18:29:43+05:30 IST
తమిళ విలక్షణ హీరో సూర్య.. ఇటీవల ‘జైభీమ్’ చిత్రంతో ఓటీటీలో సాలిడ్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డుల్ని కూడా అందుకుంది చిత్రం. ఈ సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్ సూర్య తదుపరి చిత్రం ‘ఎదరుక్కుమ్ తునిందవన్’ కి బాగా హెల్ప్ అవుతోంది. షార్ట్ ఫామ్ లో ‘ఈటీ’ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి పాండిరాజ్ దర్శకుడు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తమిళ విలక్షణ హీరో సూర్య.. ఇటీవల ‘జైభీమ్’ చిత్రంతో ఓటీటీలో సాలిడ్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డుల్ని కూడా అందుకుంది చిత్రం. ఈ సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్ సూర్య తదుపరి చిత్రం ‘ఎదరుక్కుమ్ తునిందవన్’ కి బాగా హెల్ప్ అవుతోంది. షార్ట్ ఫామ్ లో ‘ఈటీ’ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి పాండిరాజ్ దర్శకుడు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీని తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ , హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ‘ఈటీ’ పేరుతో విడుదల చేయనుండడం విశేషం.
గ్రామీణ వాతావరణంలో సాగే రివెంజ్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఇదివరకు విడుదలైన ‘ఈటీ’ ఫష్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను వచ్చేఏడాది ఫిబ్రవరి 4న విడుదల చేయబోతున్నారు. అదే రోజున టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ విడుదల కాబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కీలక పాత్రలో రామ్ చరణ్ నటించబోతున్న సంగతి తెలిసిందే. టీజర్, సింగిల్స్ తో భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాకి సూర్య పాన్ ఇండియా మూవీ ‘ఈటీ’ ఏ రేంజ్ పోటీ ఇస్తుందో చూడాలి.