వందమందిని బతికిస్తాడు
ABN , First Publish Date - 2021-11-16T05:48:36+05:30 IST
నవీన్ బేతిగంటి, అన్వేష్, మైఖేల్, పవన్ రమేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘రాక్షస కావ్యం’. శ్రీమాన్ కీర్తి దర్శకుడు. దాము రెడ్డి, ఉమేష్ చిక్కు నిర్మాతలు. ఈ సినిమా ఫస్ట్‌లుక్...

నవీన్ బేతిగంటి, అన్వేష్, మైఖేల్, పవన్ రమేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘రాక్షస కావ్యం’. శ్రీమాన్ కీర్తి దర్శకుడు. దాము రెడ్డి, ఉమేష్ చిక్కు నిర్మాతలు. ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్ సోమవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఇదో పీరియాడిక్ సోషల్ డ్రామా. 1990 నేపథ్యంలో సాగుతుంది. ఒక్కడు చదువుకుంటే, వందమందిని బతికిస్తాడు. చదువు విలువ అది. ఈ సినిమాలో ఈ పాయింట్‌ని అంతర్లీనంగా చెప్పాం. సన్నివేశాలు, సంభాషణలతో ఆలోచన రేకెత్తించబోతున్నాం’’ అన్నారు. సంగీతం: రాజీవ్ రాజ్, శ్రీకాంత్.