ఇళయరాజా: ‘మాయోన్’ మాంపాహీ పాట వైరల్

ABN , First Publish Date - 2021-12-14T23:38:47+05:30 IST

వైకుంఠ ఏకాద‌శి, గీత జ‌యంతిలను పురస్కరించుకునేలా సరైన సందర్భానికి ఈ పాటను మేకర్స్ విడుదల చేశారు. డబుల్ మీనింగ్ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై కిషోర్ ఎన్ దర్శకత్వంలో అరుణ్ మొళి మాణికం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇళయరాజా అభిమానులు ఈ పాటను..

ఇళయరాజా: ‘మాయోన్’ మాంపాహీ పాట వైరల్

సీనియర్ నటుడు సత్యరాజ్ తనయుడు శిబి సత్యరాజ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘మాయోన్’. విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ ఇప్పటికే విడుదలై మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘మాంపాహీ’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీత ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ ఈ పాట ఇప్పుడు వైరల్ అవుతోంది. 


విశేషం ఏమిటంటే.. వైకుంఠ ఏకాద‌శి, గీత జ‌యంతిలను పురస్కరించుకునేలా సరైన సందర్భానికి ఈ పాటను మేకర్స్ విడుదల చేశారు. డబుల్ మీనింగ్ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై కిషోర్ ఎన్ దర్శకత్వంలో అరుణ్ మొళి మాణికం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇళయరాజా అభిమానులు ఈ పాటను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. కాగా, తమిళ వెర్షన్‌లో విడుదలైన ఈ పాట యూట్యూబ్‌లో 24 గంటలలోపూ 1 మిలియన్ వ్యూస్ సాధించగా.. తెలుగులోనూ ఈ పాట ప్రస్తుతం మంచి స్పందనను రాబట్టుకుంటోంది.Updated Date - 2021-12-14T23:38:47+05:30 IST