సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ 90వ చిత్రం.. రిలీజ్‌కు రెడీ

ABN , First Publish Date - 2021-01-19T22:17:28+05:30 IST

ప్రముఖ సినీ నిర్మాత ఆర్‌.బి.చౌదరి నిర్మాణ సారథ్యంలో సూపర్‌గుడ్‌ ఫిలిమ్స్‌ 90వ సినిమాగా ‘కళత్తిల్‌ సందిప్పోమ్‌’ ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల

సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ 90వ చిత్రం.. రిలీజ్‌కు రెడీ

ప్రముఖ సినీ నిర్మాత ఆర్‌.బి.చౌదరి నిర్మాణ సారథ్యంలో సూపర్‌గుడ్‌ ఫిలిమ్స్‌  90వ సినిమాగా ‘కళత్తిల్‌ సందిప్పోమ్‌’ ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. జీవా, అరుళ్‌ నిధి హీరోలుగా నటించిన ఈ చిత్రానికి ఎన్‌.రాజశేఖర్‌ దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్లుగా మంజిమా మోహన్‌, ప్రియా భవానీ నటించారు. ముఖ్యంగా ‘కారైక్కుడి అప్పాచ్చి’ అనే ప్రత్యేకమైన పాత్రలో సీనియర్‌ నటుడు రాధారవి నటించారు. వీరితో పాటు రోబో శంకర్‌, బాల శరవణన్‌, ఇళవరసు, ఆడుగళం నరేన్‌, మారిముత్తు, వేలరామమూర్తి, రేణుక, శ్రీరంజని, భూలోకం రాజేష్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వీరితో పాటు ‘పిశాచు’ చిత్రం ద్వారా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న ప్రాగ్యా మార్టిన్‌ అతిథి పాత్రలో నటించారు.


ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని ప్రధానాంశంగా చేసుకుని నిర్మించినట్టు దర్శకుడు ఎన్‌.రాజశేఖర్‌ తెలిపారు. సుధీర్ఘకాలం తర్వాత వస్తున్న ఇలాంటి చిత్రానికి ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉందని నిర్మాత ఆర్‌బి. చౌదరి వెల్లడించారు. ఇప్పటికే సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 28వ తేదీన విడుదల చేస్తున్నట్టు తెలిపారు. కాగా, ఈ చిత్రానికి సంగీత బాణీలను యువన్‌ శంకర్‌ రాజా సమకూర్చారు. 

Updated Date - 2021-01-19T22:17:28+05:30 IST