సునీల్ - ధన్‌రాజ్‌ల 'బుజ్జి ఇలా రా' టైటిల్ లోగో విడుదల
ABN , First Publish Date - 2021-08-01T18:43:21+05:30 IST
కొన్ని చిత్రాల్లో కమెడియన్స్‌గా కలిసి మెప్పించిన సునీల్, ధనరాజ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీకి 'బుజ్జి ఇలా రా' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 'ఇట్స్ ఎ సైకలాజికల్ థ్రిల్లర్' అనేది ట్యాగ్‌లైన్. అందరిలో ఆసక్తిని క్రియేట్ చేస్తోన్న ఈ టైటిల్ పోస్టర్‌తోనే సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్ మూవీ అని అర్థమవుతుంది.

కొన్ని చిత్రాల్లో కమెడియన్స్‌గా కలిసి మెప్పించిన సునీల్, ధనరాజ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీకి 'బుజ్జి ఇలా రా' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 'ఇట్స్ ఎ సైకలాజికల్ థ్రిల్లర్' అనేది ట్యాగ్‌లైన్. అందరిలో ఆసక్తిని క్రియేట్ చేస్తోన్న ఈ టైటిల్ పోస్టర్‌తోనే సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్ మూవీ అని అర్థమవుతుంది. గరుడవేగ అంజి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారు. సినిమాకు ఆయనే సినిమాటోగ్రాఫర్‌గానూ వర్క్ చేస్తారు. ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను అందిస్తున్నారు. రూపా జగదీశ్ సమర్పణలో ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ ఎల్ఎల్‌పి, జీ నాగేశ్వరరెడ్డి టీమ్ వర్క్ పతాకాలపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి భాను, నందు మాటలను అందిస్తున్నారు. చాందిని తమిళరసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.