సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sumanth: పెళ్లంటే ఎందుకు అలర్జీ!

ABN, First Publish Date - 2021-08-14T21:43:05+05:30

సుమంత్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మళ్ళీ మొదలైంది’. మోస్ట్‌ కన్‌ప్యూజ్డ్‌ డివోర్స్‌ అన్నది ఉపశీర్షిక. టి.జి.కీర్తి కుమార్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని కె. రాజశేఖర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. శుక్రవారం హీరో సుమంత్‌ క్యారెక్టర్‌ రివీలింగ్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుమంత్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మళ్ళీ మొదలైంది’. మోస్ట్‌ కన్‌ప్యూజ్డ్‌ డివోర్స్‌ అన్నది ఉపశీర్షిక. టి.జి.కీర్తి కుమార్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని కె. రాజశేఖర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. శుక్రవారం హీరో సుమంత్‌ క్యారెక్టర్‌ రివీలింగ్‌ పోస్టర్‌ను  చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో సుమంత్‌ క్లాస్‌గా సూపర్‌ స్టైలిష్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఇందులో పెళ్లంటే అసలు ఇష్టంలేని యువకుడిగా ఆయన కనిపిస్తారు. అతని రిలేషన్‌ షిప్‌ ేస్టటస్‌ అందరికీ క్వశ్చన్‌ మార్క్‌లా ఉంటుంది. ఒంటరిగా ఉంటాడు.. బాగా వండుతాడు. ఇవి అతనిలో ఉండే గుణాలు. సినిమాలో హీరోకి పెళ్లంటే ఎందుకు అలర్జీ అనేది ఆసక్తికరం అని దర్శకుడు చెప్పారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నైనా గంగూలీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సుహాసిని మణిరత్నం, వెన్నెల కిషోర్‌, మంజుల ఘట్టమనేని ఇతర పాత్రధారులు. అనూప్‌ రూబెన్స్‌ సంగీత దర్శకుడు. 




Updated Date - 2021-08-14T21:43:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!