సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

బాలీవుడ్ హీరోకు డబ్బింగ్ చెబుతున్న సుమంత్

ABN, First Publish Date - 2021-12-01T16:14:03+05:30

బాలీవుడ్ హీరోకు టాలీవుడ్ హీరో సుమంత్ డబ్బింగ్ చెబుతున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో లెజెండరీ క్రికెటర్ టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ బయోపిక్ '83'.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ హీరోకు టాలీవుడ్ హీరో సుమంత్ డబ్బింగ్ చెబుతున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో లెజెండరీ క్రికెటర్ టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ బయోపిక్ '83'. ఈ మూవీలో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ టైటిల్ రోల్ పోషించారు. కపిల్ దేవ్ భార్య రోమీ దేవ్‌గా రణవీర్ సతీమణి దీపికా పదుకొణె  నటించారు. కరోనా వేవ్స్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమాను డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్న'83' చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై కింగ్ నాగార్జున థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా చిత్ర ట్రైలర్ కూడా వచ్చి విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా, తెలుగు వెర్షన్ '83' లోని రణవీర్ సింగ్ పాత్రకు టాలీవుడ్ హీరో సుమంత్ డబ్బింగ్ చెబుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ - ఫాంటమ్ ఫిలిమ్స్ సమర్పణలో కబీర్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దీపికా పదుకునే - కబీర్ ఖాన్ - విష్ణు వర్ధన్ ఇందూరి - సాజిద్ నడియావాలా నిర్మించారు. 

Updated Date - 2021-12-01T16:14:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!