సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మా–డ్రగ్స్‌ కేసు.. సుమన్‌ ఏమన్నారంటే!

ABN, First Publish Date - 2021-09-13T15:39:53+05:30

ఇటీవల నెల్లూరులోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్‌ నటుడు సుమన్‌ మా ఎన్నికల గురించి ఘాటుగా స్పందించారు. ‘మా ’ ఎన్నికల్లో తాను పోటీచేస్తున్నట్లుగా వస్తున్న వార్తలను ఖండించారు. సినిమాకు సంబంధించి ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడం ఇష్టం లేదని తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఇటీవల నెల్లూరులోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్‌ నటుడు సుమన్‌ మా ఎన్నికల గురించి ఘాటుగా స్పందించారు. ‘మా ’ ఎన్నికల్లో తాను పోటీచేస్తున్నట్లుగా వస్తున్న వార్తలను ఖండించారు. సినిమాకు సంబంధించి ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడం ఇష్టం లేదని తెలిపారు. గతంలో ఎప్పుడూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటి పరిణామాలు చూడలేదని అన్నారు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న ఆయన రెండు పడవల ప్రయాణం చేయాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. 


టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు గురించి కూడా ఆయన స్పందించారు. ఈ సమస్య ఒక్క సినిమా పరిశ్రమదే కాదు. అన్ని రంగాల్లోనూ ఉంది. సినిమా అనేది రంగుల ప్రపంచం కాబట్టి అందరి దృష్టి దీనిపైనే ఉంటుంది. జరగాల్సిన దానికన్నా ఎక్కువ ప్రచారం జరుగుతోంది. ఒకరు డ్రగ్స్‌ తీసుకుంటున్నారు అంటే దాని వెనుక చాలా రకాల కారణాలుంటాయి’’ అని సుమన్‌ చెప్పారు. 


Updated Date - 2021-09-13T15:39:53+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!