సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సుమ కనకాల వెండితెర రీఎంట్రీ.. ప్రీలుక్ వచ్చేసింది!

ABN, First Publish Date - 2021-11-05T15:50:16+05:30

పాప్యులర్ యాంకర్ సుమ కనకాల.. వెండితెర రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు. ఆపై యాంకర్ గా బిజీ అయిపోయారు. ప్రస్తుతం హైయెస్ట్ పెయిడెడ్ యాంకర్ గా సత్తాచాటుకుంటున్న ఆమె.. ప్రధాన పాత్రలో నటించడానికి అంగీకారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాప్యులర్ యాంకర్ సుమ కనకాల.. వెండితెర రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు. ఆపై యాంకర్ గా బిజీ అయిపోయారు. ప్రస్తుతం హైయెస్ట్ పెయిడెడ్ యాంకర్ గా సత్తాచాటుకుంటున్న ఆమె..  ప్రధాన పాత్రలో నటించడానికి అంగీకారం తెలిపారు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.2 గా సినిమా నిర్మాణం జరుపుకోనుంది. దీనికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ ను దీపావళి సందర్బంగా విడుదల చేశారు మేకర్స్. 



ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను శనివారం (నవంబర్ 6) విడుదల చేయబోతున్నారు. రోలుపై నిలబెట్టిన రోకలి, ఒక మహిళ చెయ్యి ప్రీలుక్ పోస్టర్ పై రివీల్ అయింది. ఆ చేతిపై వెంకన్న అని రాసుంది. ఇందులో సుమ కనకాల పాత్రకి చాలా ప్రాధాన్యత ఉందని అర్ధమవుతోంది. కీరవాణి సంగీతం అందిస్తోన్న ఈ సినిమా త్వరలోనే లాంఛ్ కాబోతోంది.  ఆల్రెడీ యాంకర్ గా మంచి పేరు తెచ్చుకోవడం.. జనంలో తనకి మంచి పాపులారిటీ ఉండడంతో సుమ ఇకపై వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  



Updated Date - 2021-11-05T15:50:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!