సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

గుండె నిండు గర్భిణిలా ఉంది.. ప్రసవించలేని దు:ఖం పుట్టుకొస్తోంది: సుకుమార్

ABN, First Publish Date - 2021-12-01T03:51:35+05:30

‘గుండె నిండు గర్భిణిలా ఉంది.. ప్రసవించలేని దు:ఖం పుట్టుకొస్తోంది’ అంటూ దర్శకుడు సుకుమార్ ఉద్వేగభరితమయ్యారు. సీతారామశాస్త్రి రాయని పాటలాగా ప్రేక్షకలోకం మిగిలిపోయిందంటూ.. ఆయన ఫేస్‌బుక్ వేదికగా సిరివెన్నెలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘గుండె నిండు గర్భిణిలా ఉంది.. ప్రసవించలేని దు:ఖం పుట్టుకొస్తోంది’ అంటూ దర్శకుడు సుకుమార్ ఉద్వేగభరితమయ్యారు. సీతారామశాస్త్రి రాయని పాటలాగా ప్రేక్షకలోకం మిగిలిపోయిందంటూ.. ఆయన ఫేస్‌బుక్ వేదికగా సిరివెన్నెలకు నివాళులు అర్పించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంపై సుకుమార్ స్పందన.. ఇప్పుడందరి కంట కన్నీరు పెట్టిస్తోంది. 


‘‘గుండె నిండు గర్భిణిలా ఉంది

ప్రసవించలేని దు:ఖం పుట్టుకొస్తోంది

తల్లి కాగితానికి దూరమై 

అక్షరాల పిల్లలు

గుక్కపట్టి ఏడుస్తున్నాయ్

మీరు బ్రతికే ఉన్నారు

పాట తన ప్రాణం పోగొట్టుకుంది

మీరు ఎప్పటికి రాయని పాటలాగ

మేం మిగిలిపోయాం

- సుకుమార్’’ అని సుకుమార్ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.



Updated Date - 2021-12-01T03:51:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!