బన్నీ యూనిక్.. ఐకాన్ స్టార్: సుకుమార్
ABN , First Publish Date - 2021-04-08T04:27:33+05:30 IST
ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ...

‘‘బన్నీకి స్టైలిష్ స్టార్ అని ఎప్పుడు పేరొచ్చిందో తెలియదు. కానీ.. పుష్ప సినిమాలో బన్నీ అమేజింగ్ పెర్ఫామెన్స్ అందించబోతున్నామని కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. అది చూసిన తర్వాత స్టైలిష్ అనే పదంలో పెర్ఫామెన్స్ లేదనిపించింది. తను చేసే పెర్ఫామెన్స్‌కు స్టైలిష్‌కు సబంధం లేదనిపించింది’’ అని అన్నారు డైరెక్టర్ సుకుమార్.
బుధవారం జరిగిన ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్ కార్యక్రమంలో భాగంగా సుకుమార్ మాట్లాడుతూ - ‘‘బన్నీ చాలా యూనిక్. తను ఎంచుకునే ప్రతి సినిమా యూనిక్. తను వేసుకునే డ్రెస్సింగ్ నుంచి అన్నింట్లో యూనిక్‌గా ఉంటాడు. తను ఇకపై స్టైలిష్ స్టార్ కాడు.. బన్నీ ఇకపై ఐకాన్ స్టార్. ఇంతకు ముందు అందరూ బన్నీని ఆర్య అని పిలిచేవారు. అయితే ఈ సినిమా తర్వాత అందరూ తనని ఐకాన్ స్టార్ అని పిలవాలి లేదా.. పుష్ప అని పిలవాలి. మా నిర్మాతలకు ఈ సందర్భంగా థాంక్స్. కావాల్సినంత సపోర్ట్‌ను అందించారు. మా సినిమాటోగ్రాఫర్ కూబా, ఏ దేశం నుంచి వచ్చాడో తెలియదు కానీ.. అమేజింగ్ టెక్నీషియన్. నా భాష తనకు అర్థం కాదు, తన భాష నాకు అర్థం కాదు. కానీ.. సినిమా మాత్రం ఇద్దరికీ అర్థమవుతుంది. నా సినిమా బ్రహ్మలు రామకృష్ణ, మోనిక, నా మూడ్ స్వింగ్స్‌ను భరిస్తున్న దీపాళి, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ అద్భుతంగా సినిమాను తీర్చిదిద్దారు. పీటర్ హెయిన్స్, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ సహా పేరు పేరున ఈ సినిమా కోసం కష్టపడుతున్న అందరికీ థాంక్స్’’ అన్నారు.