సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సుధీర్ బాబు సినిమా నిర్మాణంలో భాగమైన మైత్రీ మూవీ మేకర్స్

ABN, First Publish Date - 2021-12-29T18:35:37+05:30

సుధీర్ బాబు సినిమా నిర్మాణంలో మైత్రీ మూవీ మేకర్స్ భాగమయ్యారు. డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుధీర్ బాబు సినిమా నిర్మాణంలో మైత్రీ మూవీ మేకర్స్ భాగమయ్యారు. డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఇందులో సుధీర్ బాబు సరసన 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమా నిర్మాణంలో ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా భాగం అయింది. తాజాగా, ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడిస్తూ చిత్ర బృందం ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇక రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 



Updated Date - 2021-12-29T18:35:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!