మహేష్‌ని బెదిరించినా.. ఆ పని చేయడు: సుధీర్ బాబు

ABN , First Publish Date - 2021-08-29T02:38:37+05:30 IST

మంచి కంటెంట్ ఉన్న సినిమాను తీశాము. ఇది రెగ్యులర్ సినిమా కాదు అని ఎన్నో సార్లు చెప్పాను. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడికి సూరిబాబు, శ్రీదేవి పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇప్పటి వరకు ఈ సినిమా చూసిన ఎవ్వరూ సినిమా

మహేష్‌ని బెదిరించినా.. ఆ పని చేయడు: సుధీర్ బాబు

సుధీర్ బాబు, ఆనంది హీరో హీరోయిన్లుగా ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70ఎమ్ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఆగ‌స్ట్ 27న విడుద‌లైన ఈ చిత్రం థియేటర్స్‌లలో సూపర్ హిట్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ సందర్బంగా శనివారం హైద్రాబాద్‌లో చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. 


ఈ కార్యక్రమంలో హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. ‘‘మంచి కంటెంట్ ఉన్న సినిమాను తీశాము. ఇది రెగ్యులర్ సినిమా కాదు అని ఎన్నో సార్లు చెప్పాను. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడికి సూరిబాబు, శ్రీదేవి పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇప్పటి వరకు ఈ సినిమా చూసిన ఎవ్వరూ సినిమా బాలేదని చెప్పలేదు. సినిమా బాగుందని అందరి నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. మహేష్, ప్రశాంత్ నీల్, రానా, నిహారిక కొణిదెల గార్లు సినిమా బాగుందని ట్వీట్ చేశారు. మహేష్ బాబు అనే వ్యక్తిని బెదిరించినా లేక రూ. 200 కోట్లు ఇచ్చినా కూడా తన కెరియర్‌లో తను నమ్మందే ఏది చేయడు. ఈ సినిమాకు తను పంపిన ట్వీట్‌లో ఎవరెవరు ఏం చేశారు అనేది క్లియర్‌గా చెప్పాడు. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. నచ్చితే పదిమందికి తెలియజేయండి. ఫ్యామిలీ అందరూ కలసి వచ్చి ఈ సినిమా చూడండి. అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. సహకరించిన అందరికీ నా ధన్యవాదాలు..’’ అన్నారు.

Updated Date - 2021-08-29T02:38:37+05:30 IST