సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘స్ర్టీట్‌ లైట్‌’ కింద ఏం జరిగింది?

ABN, First Publish Date - 2021-10-23T04:10:05+05:30

తాన్య దేశాయ్‌, అంకిత్‌ రాజ్‌, కావ్య రెడ్డి, విశ్వ దర్శకత్వంలో మామిడాల శ్రీనివాస్‌ నిర్మించిన చిత్రం ‘స్ర్టీట్‌ లైట్‌’’. సీనియర్‌ హీరో వినోద్‌ కుమార్‌ కీలక పాత్రలో కనిపిస్తారు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్‌ 12న తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాన్య దేశాయ్‌, అంకిత్‌ రాజ్‌, కావ్య రెడ్డి, విశ్వ దర్శకత్వంలో మామిడాల శ్రీనివాస్‌ నిర్మించిన చిత్రం ‘స్ర్టీట్‌ లైట్‌’’. సీనియర్‌ హీరో వినోద్‌ కుమార్‌ కీలక పాత్రలో కనిపిస్తారు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్‌ 12న తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ‘‘కుటుంబ కథతోపాటు చక్కని సందేశం ఉన్న చిత్రమిది. ఒక రాత్రి స్ర్టీట్‌ లైట్‌ కింద చీకట్లో జరిగే సంఘటనలతో దర్శకుడు ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కించారు. అందరూ ఈ సినిమాను బూతు సినిమా అనుకుంటున్నారు. కానీ ఈ సినిమాలో ఆన్ని రకాల షేడ్స్‌ ఉన్నాయి’’ అని నిర్మాత చెప్పారు. ‘‘ఒక రాత్రి స్ర్టీట్‌ లైట్‌ కింద విభిన్న వ్యక్తుల వింత పోకడలను సునిశితమైన రీతిలో వినోదాత్మకంగా చూపిస్తూ, పగలు మంచివాళ్ళుగా చెలామణి అవుతూ రాత్రి కాగానే సెక్సువల్‌ పర్వషన్స్‌తో తమ క్రేౖమ్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తూ అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారో, అందులో ఒక యువతికి జరిగిన అన్యాయానికి ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంది. అనే కథతో సాగే చిత్రమిది. నవంబర్‌ 12న థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నాం’’ అని దర్శకుడు అన్నారు. 



Updated Date - 2021-10-23T04:10:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!