స్టార్ మా సరికొత్త సీరియల్ కథ.. ‘అమ్మ’!!
ABN, First Publish Date - 2021-07-19T15:37:57+05:30
విలక్షణమైన కథలు, వినూత్నమైన కథనాలతో...
విలక్షణమైన కథలు, వినూత్నమైన కథనాలతో ప్రేక్షకులకు విభిన్నమైన ధారావాహికలను అందిస్తున్న ‘స్టార్ మా’.. ఇప్పుడు మరో సరికొత్త కథని సీరియల్‌గా అందిస్తోంది. ఆ కథ పేరు "అమ్మకు తెలియని కోయిలమ్మ". అనుబంధాల మధ్య సంఘర్షణ, ఆప్యాయతల మధ్య దూరాలు పెరిగి ఎవరి కథ ఎలా షాక్ ఇవ్వబోతోంది? ఎవరి కథ ఎందుకలా అయింది? అసలు ఎందుకు ఇలా జరిగింది? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం "అమ్మకు తెలియని కోయిలమ్మ". అమ్మకీ కోయిలమ్మకీ మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందో.. అనుబంధాల ఆధారంగా విశ్లేషించే కథ ఇది.
తెలుగు సినిమాల్లో ఎన్నో ముఖ్యమైన కేరక్టర్స్ చేసిన మంజు భార్గవి ఈ కథలో ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ నటులు చిన్నా, వినోద్ బాల, అశ్వని గౌడ ముఖ్యమైన కేరక్టర్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హీరోయిన్‌గా కావ్యశ్రీ నటిస్తున్నారు.
జులై 19న రాత్రి 9.30 గంటల నుంచి ‘స్టార్ మా’లో ప్రసారమయ్యే ఈ సీరియల్ సోమవారం నుంచి శుక్రవారం వరకు ‘స్టార్ మా’ ప్రేక్షకుల్ని అలరించనున్నది.